మేఘన్నా అభయహస్తం ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

మేఘన్నా అభయహస్తం ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

పెద్దమందడి,సెప్టెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి గ్రామానికి చెందిన బక్క బాల్ చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన నిరుపేద కుటుంబాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ‘మేఘన్నా అభయహస్తం’ ద్వారా ఆదుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని గ్రామ నాయకులు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చెన్నయ్య కుటుంబ పరిస్థితిని స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అమ్మపల్లి గ్రామ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ బాబు నాయక్, బి. చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ ఆంజనేయులు, బాలు, రాముల నాయక్, సి. రమేష్, చిన్న రాములు, గూడెం మన్యం, గ్రామ పెద్ద అర్జునయ్య తదితరులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News