అవార్డులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు.
వనపర్తి,సెప్టెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
అవార్డులు ఉద్యోగులకు మరింత ప్రేరణనిచ్చి, విధి నిర్వహణలో మరింత అంకితభావంతో పనిచేసేలా ఉత్సాహాన్ని కలిగిస్తాయని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న కంచిరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల భాషా ఉపాధ్యాయుడు వంగూరు నారాయణరెడ్డిని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.విద్యార్థులు ఆంగ్ల భాషలో రాణించేలా అంకితభావంతో పనిచేస్తున్న వంగూరు నారాయణరెడ్డికి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం సంతోషకరమైన విషయమన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విద్యారంగంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, అనురాధ, రాజేష్‌బాబు, రాజు, బైరోజు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, శేఖర్, ఫాతిమా, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


Comments