స్పీకర్‌పై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలి.

బీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలి: వొడితల ప్రణవ్.

స్పీకర్‌పై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలి.

హుజురాబాద్,సెప్టెంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):

అసెంబ్లీ సాక్షిగా ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ పార్టీ క్షమాపణ చెప్పి, వెంటనే మధుపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రణవ్‌ అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, ఇప్పుడు అదే దళిత జాతికి చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉన్నత పదవిలో కొనసాగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది చీకటి దినమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు సభ వెలుపల అనుచితంగా, దుర్భాషలాడటం సమంజసం కాదన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు.
స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఉపేక్షించబోదని వొడితల ప్రణవ్‌ స్పష్టం చేశారు. తాతా మధుపై తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన. బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన.
సత్తుపల్లి, సెప్టెంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):  అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు...
హామీలు అమలు చేసే వరకు ఉద్యమమే.
పలుస శంకర్ గౌడ్ సేవలకు దక్కిన గౌరవం.
అవార్డులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి.
రేవల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
కాంగ్రెస్–బీజేపీ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి.
ఎమ్మెల్యేల అరెస్ట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్.