ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్.

మంజులత, మండల విద్యాధికారి.

ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్.

పెద్దమందడి,సెప్టెంబరు07(తెలంగాణ ముచ్చట్లు):

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అలంకరించి ఉపాధ్యాయులందరికీ ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత అన్నారు.రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి శాలువా, పుష్పగుచ్ఛం, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో సన్మానించారు.ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంజులత పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రేవల్లి మండల విద్యాధికారి వరప్రసాద్‌రావు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు శాంతన్న, పి. ప్రసాద్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు, వెంకటేష్, పెద్దమందడి సర్పంచ్ గంగమ్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన. బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన.
సత్తుపల్లి, సెప్టెంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):  అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు...
హామీలు అమలు చేసే వరకు ఉద్యమమే.
పలుస శంకర్ గౌడ్ సేవలకు దక్కిన గౌరవం.
అవార్డులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి.
రేవల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
కాంగ్రెస్–బీజేపీ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి.
ఎమ్మెల్యేల అరెస్ట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్.