ఆరు గ్యారంటీలపై ఆగ్రహం.. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ రాస్తారోకో.
ముల్కనూర్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం.. ఎంపీడీవోకు వినతిపత్రం.
Views: 78
On
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆందోళన చేపట్టారు.
ఆరు గ్యారంటీల అమలు కోసం ఆందోళనలు చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆరోపిస్తూ ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ భీమదేవరపల్లి ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Sep 2026 20:32:32
సత్తుపల్లి, సెప్టెంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు...


Comments