ఆర్టీఐ నియోజకవర్గ అధ్యక్షుడిగా నాగార్జున.
ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్.
హుజూరాబాద్,సెప్టెంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
సమాచార హక్కు చట్టం (RTI) సాధన కమిటీ హుజూరాబాద్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా తిరగమల్ల నాగార్జున నియమితులయ్యారు. ఇప్పటివరకు హుజూరాబాద్ మండల అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన సేవలను గుర్తించిన కమిటీ ఉన్నత నాయకత్వం, ఆయనకు నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.
జిల్లా కన్వీనర్ బండ నరేందర్ సహకారంతో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ, రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ సమక్షంలో తిరగమల్ల నాగార్జునను నియోజకవర్గ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన సేవలను గుర్తించి నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రమోట్ చేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్‌కు, నిరంతరం ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న జిల్లా కన్వీనర్ బండ నరేందర్‌కు, రాష్ట్ర కమిటీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ఆర్టీఐ చట్టం ద్వారా ప్రజలకు లభించాల్సిన న్యాయమైన హక్కులను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తానని నాగార్జున తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి RTI చట్టం విశిష్టతను తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించి కమిటీని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.
నాగార్జున నియామకంపై జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్, జిల్లా కన్వీనర్ బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments