ఎంఈఎఫ్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ గద్వాల కృష్ణ మాదిగకు ఘన సన్మానం.
వనపర్తి,సెప్టెంబర్08(తెలంగాణ ముచ్చట్లు)
ఎంఈఎఫ్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన గద్వాల కృష్ణ మాదిగను వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు ఘనంగా సన్మానించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఈఎఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ బోరెల్లి వెంకటయ్య మాదిగ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గద్వాల కృష్ణ మాదిగకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం సామాజిక న్యాయ ఉద్యమానికి లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు. మాదిగ సమాజ హక్కులు, ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ, బహుజన సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ఇంచార్జీ కొమ్మవారి మస్తాన్ మాదిగ, నియోజకవర్గ ఇంచార్జీ కొమ్ము చెన్నకేశవులు మాదిగలు గద్వాల కృష్ణ మాదిగను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎంఈఎఫ్ ఉద్యమం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో చింతకుంట మద్దిలేటి మాదిగ, కేశపోగు కేశవులు మాదిగ, మీసాల నాగరాజు మాదిగ, మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, అరకల రమేష్ మాదిగ, మచ్చ తిరుపతి మాదిగ, పుట్టపగ అజయ్ కుమార్ మాదిగ, దయ్యపు రవివర్మ మాదిగ, స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments