గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు.
మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 08(తెలంగాణ ముచ్చట్లు):
2026గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు ఇంటిమేషన్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.ఈ ఏడాది తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. గత సంవత్సరం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిర్వాహకులు తమ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ లేదా గత సంవత్సరం రిఫరెన్స్ ఐడీ ద్వారా సెర్చ్ చేస్తే గతంలో నమోదు చేసిన వివరాలు అప్లికేషన్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ప్రస్తుత గణేష్ విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, సమయం, వినియోగించే వాహనం తదితర తాజా వివరాలను అప్లికేషన్‌లో నమోదు చేయాలని కోరారు.అలాగే సంబంధిత విద్యుత్ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి గణేష్ మండపంలో ఒక కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను మద్యపాన రహితంగా, పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వహించాలని, డీజేలు వినియోగించకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని ముల్కనూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


Comments