ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న లక్ష్మణ్ నాయక్.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న లక్ష్మణ్ నాయక్.

పెద్దమందడి,సెప్టెంబర్08(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్‌కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ప్రధానోపాధ్యాయుడిగా ఉత్తమ సేవలు అందించినందుకు మండల విద్యాధికారిణి మంజులత చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.కార్యక్రమంలో రేవల్లి మండల విద్యాధికారి వరప్రసాద్ రావు, వెల్టూర్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు, పెద్దమందడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న, పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు.
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 08(తెలంగాణ ముచ్చట్లు):  2026గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు ఇంటిమేషన్ ఇవ్వాలని పోలీసులు...
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న లక్ష్మణ్ నాయక్.
నీట్‌లో ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించిన యువరాజ్‌కు సన్మానం.
పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు శరవేగంగా.
ఎంఈఎఫ్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ గద్వాల కృష్ణ మాదిగకు ఘన సన్మానం.
హామీలతో గెలిచారు.. అమలుతో నిలబడాలి.