పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు శరవేగంగా.

పెద్దమందడి కాంగ్రెస్ నాయకులు.

పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు శరవేగంగా.

పెద్దమందడి,సెప్టెంబర్08(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి - వనపర్తి పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజల దీర్ఘకాలిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రహదారి అభివృద్ధికి రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.పలు సాంకేతిక, పరిపాలనా కారణాలతో కొంతకాలం నిలిచిపోయిన పనులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో తిరిగి వేగం పుంజుకున్నాయని తెలిపారు. రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, నిర్మాణ సంస్థ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.పెద్దమందడి–వనపర్తి రోడ్డు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాహనదారులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని అన్నారు. పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు వనపర్తి పట్టణంతో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు.
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 08(తెలంగాణ ముచ్చట్లు):  2026గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు ఇంటిమేషన్ ఇవ్వాలని పోలీసులు...
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న లక్ష్మణ్ నాయక్.
నీట్‌లో ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించిన యువరాజ్‌కు సన్మానం.
పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు శరవేగంగా.
ఎంఈఎఫ్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ గద్వాల కృష్ణ మాదిగకు ఘన సన్మానం.
హామీలతో గెలిచారు.. అమలుతో నిలబడాలి.