నీట్‌లో ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించిన యువరాజ్‌కు సన్మానం.
పెద్దమందడి,సెప్టెంబర్08(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు యువరాజ్ నీట్ ఫలితాల్లో 397 మార్కులు సాధించి సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా అంబేద్కర్ యువకులు, కాలనీవాసులు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మాట్లాడుతూ యువరాజ్ తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తూ కుమారుడిని ఉన్నతంగా చదివించారని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చని యువరాజ్ నిరూపించాడని అన్నారు. నీట్‌లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.యువరాజ్ వైద్య విద్యలో రాణించి పేదలకు సేవ చేయాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆశయాలైన విద్య, అభివృద్ధి, సమానత్వం దిశగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు గట్టు సతీష్, గట్టు వరలక్ష్మి, గట్టు నాగమనెమ్మ, గ్రామ మాజీ సర్పంచ్ గట్టు మన్యం, కాలనీ పెద్దలు గట్టు నారాయణ, గట్టు దయాకర్, గట్టు పెంటన్న, గట్టు కృష్ణయ్య, యువకులు గట్టు చిన్నయ్య, జనంపల్లి మన్యం, గట్టు కళ్యాణ్ బాబు, గట్టు రాజు, గట్టు మల్లేష్, గట్టు విజయ్, గట్టు శివ, గట్టు నగేష్, గట్టు బల్‌రామ్, గట్టు విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Comments