చింతకుంటలో ఘనంగా అంబికా బ్యాంకెట్‌ హాల్‌ ప్రారంభం.

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డి.

చింతకుంటలో ఘనంగా అంబికా బ్యాంకెట్‌ హాల్‌ ప్రారంభం.

కరీంనగర్, సెప్టెంబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):

 కరీంనగర్‌ శివారులోని చింతకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా ఏసీ బ్యాంకెట్‌ హాల్‌ను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, విఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అల్ఫోర్స్‌ డా.వి.నరేందర్‌ రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్‌ కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ అధ్యక్షులు శ్రావణ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ కార్యాలయం పైభాగంలో ఈ బ్యాంకెట్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ వాణిజ్య రంగంలో నూతన ఒరవడిని సృష్టించేలా ముందుకు సాగాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన సేవలను అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ముల్కనూర్ పోలీసుల సూచనలు.
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 08(తెలంగాణ ముచ్చట్లు):  2026గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు ఇంటిమేషన్ ఇవ్వాలని పోలీసులు...
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న లక్ష్మణ్ నాయక్.
నీట్‌లో ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించిన యువరాజ్‌కు సన్మానం.
పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు శరవేగంగా.
ఎంఈఎఫ్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ గద్వాల కృష్ణ మాదిగకు ఘన సన్మానం.
హామీలతో గెలిచారు.. అమలుతో నిలబడాలి.