ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.

పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్

స్టేషన్ ఘనపూర్,సెప్టెంబర్10(తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, రజక కుల సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐలమ్మ సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆనాడు రజాకారుల దౌర్జన్యాలను, భూస్వాముల అక్రమాలను ధైర్యంగా ఎదిరించి పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళలు సైతం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడగలరని నిరూపించిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. ఆమె ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొన్న రవి, పొన్న రాజేష్, బొల్లు లక్ష్మీ, అంగడి రజిత-కృష్ణ, బూర్ల రాజేశ్వర్, తాటికొండ మధు, సౌదరపల్లి సంపత్ రాజ్, గుర్రం హరినాథ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, కొలిపాక సతీష్, మాజీ ఎంపీటీసీ గట్టు రమేష్, పెసరు సారయ్య, తోకల రాజు, 18వ వార్డు అధ్యక్షుడు మామిళ్ల శ్రీనివాస్, రజక సంఘం నాయకులు పొన్న సత్యనారాయణ, రిటైర్డ్ ఉద్యోగి పొన్న రమేష్, పొన్న మధు, చందు శ్రీకాంత్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

చాగల్లు లో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు బస్టాండు వద్ద కూడా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఆమె ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక IMG-20260910-WA0016సంఘం పెద్దమనుషులు పొన్న రవీందర్, పొన్న రాజయ్య, మచ్చ వెంకటయ్య, పొన్న యాకయ్య, పొన్న రాజేష్, సంతోష్, గ్రామస్తులు మహమ్మద్ సాదిక్, లక్ష్మీనారాయణ, విజయ్, రాజయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం. శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం.
కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి.. నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రేవల్లి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):  శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ...
మంగంపల్లి ఆలయాల అభివృద్ధికి రూ.కోటి.
ఫారం 6తో యువత ఓటరుగా నమోదు కావాలి.
గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.!
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.
వీరవనిత ఐలమ్మ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.