ఫారం 6తో యువత ఓటరుగా నమోదు కావాలి.

పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .

ఫారం 6తో యువత ఓటరుగా నమోదు కావాలి.

 వనపర్తి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. శర్వాణి డి.ఈడీ కళాశాలలో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఓటు కీలకమని అన్నారు. ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు.18 సంవత్సరాలు నిండిన వారు ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, సమీపంలోని బూత్ స్థాయి అధికారిని సంప్రదించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యువత ఓటు విలువను గుర్తించి, తప్పనిసరిగా ఓటు వేసి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కవి జనజ్వాలా, సినారే పురస్కార గ్రహీత గంధం నాగరాజు, దర్శకుడు దేశీ రాములు, యువకవి తిరుమలేష్, దర్శకుడు తిరుపతి రెడ్డి, వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు వెంకటేష్, అధ్యాపకులు నాగరాజు, ప్రవీణ్ కుమార్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం. శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం.
కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి.. నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రేవల్లి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):  శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ...
మంగంపల్లి ఆలయాల అభివృద్ధికి రూ.కోటి.
ఫారం 6తో యువత ఓటరుగా నమోదు కావాలి.
గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.!
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.
వీరవనిత ఐలమ్మ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.