327 ఐఎన్‌టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దండెబోయిన ఐలయ్య యాదవ్.
స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)-327 (ఐఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ) జిల్లా, డివిజన్ స్థాయి ఎన్నికలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ పరిధిలోని ఫతేపూర్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న దండెబోయిన ఐలయ్య యాదవ్‌ను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఐలయ్య యాదవ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఇనుగాల శ్రీధర్‌కు ఐలయ్య యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, జిల్లా కార్యదర్శి చెట్టుపల్లి నరేందర్‌రెడ్డి, జిల్లా సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూసాని రాజ్‌కుమార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని ఐలయ్య యాదవ్ పేర్కొన్నారు.


Comments