అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులను ఖండించిన బీఆర్‌ఎస్‌.

అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులను ఖండించిన బీఆర్‌ఎస్‌.

పెద్దమందడి,సెప్టెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తరలివెళ్తున్న అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని పెద్దమందడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అంగన్‌వాడీల శాంతియుత నిరసనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి చెందిన అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు తెల్లవారుజామునే ముందస్తుగా అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న అంగన్వాడి మహిళలను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసి అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల న్యాయమైన పోరాటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దమందడి మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తీగలతండాలో ఘనంగా బోనాలు. తీగలతండాలో ఘనంగా బోనాలు.
డప్పుచప్పుళ్లు.. శివసత్తుల శిగాలు.. డీజే పాటలతో సందడి పోచమ్మ తల్లికి బోనాలతో మహిళల మొక్కులు స్టేషన్‌ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 9 (తెలంగాణ ముచ్చట్లు):  శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా చిల్పూర్‌...
కాళోజీకి ఘన నివాళులు.
విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ.
అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులను ఖండించిన బీఆర్‌ఎస్‌.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి.!
కొత్తూరులో కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్.