తీగలతండాలో ఘనంగా బోనాలు.
Views: 1
On
డప్పుచప్పుళ్లు.. శివసత్తుల శిగాలు.. డీజే పాటలతో సందడి
పోచమ్మ తల్లికి బోనాలతో మహిళల మొక్కులు
స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా చిల్పూర్ మండలంలోని తీగలతండాలో బోనాల పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను అందంగా అలంకరించి, భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి సమర్పించారు.బోనాల ఊరేగింపులో డప్పుచప్పుళ్లు, శివసత్తుల శిగాలు, డీజే పాటలతో తండాలో సందడి వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ బోనాల వేడుకల్లో గ్రామ సర్పంచ్ తీగల సంబరాజు యాదవ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 Sep 2026 21:29:33
డప్పుచప్పుళ్లు.. శివసత్తుల శిగాలు.. డీజే పాటలతో సందడి
పోచమ్మ తల్లికి బోనాలతో మహిళల మొక్కులు
స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా చిల్పూర్...


Comments