విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ.

ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.

విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ.

సైదాపూర్ ,సెప్టెంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు ):

ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు సమకూర్చిన షూస్, సాక్స్‌ను బుధవారం పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై చదువుల్లో రాణించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల్లో వివిధ సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేయడం జరిగిందన్నారు. వీటిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ వేముల శ్రీకాంత్, ఉపసర్పంచ్ శ్రీ కొంకట పవన్, పాఠశాల సముదాయాల హెడ్‌మాస్టర్ శ్రీ సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేసి వారిని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తీగలతండాలో ఘనంగా బోనాలు. తీగలతండాలో ఘనంగా బోనాలు.
డప్పుచప్పుళ్లు.. శివసత్తుల శిగాలు.. డీజే పాటలతో సందడి పోచమ్మ తల్లికి బోనాలతో మహిళల మొక్కులు స్టేషన్‌ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 9 (తెలంగాణ ముచ్చట్లు):  శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా చిల్పూర్‌...
కాళోజీకి ఘన నివాళులు.
విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ.
అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులను ఖండించిన బీఆర్‌ఎస్‌.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి.!
కొత్తూరులో కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్.