మంగంపల్లి ఆలయాల అభివృద్ధికి రూ.కోటి.
ఎస్‌డీఎఫ్ 2026–27 కింద రూ.100 లక్షలు మంజూరు.
పెద్దమందడి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ఎస్‌డీఎఫ్ 2026–27 కింద ప్లానింగ్ శాఖ ద్వారా రూ.100 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 10న జీవో ఆర్.టి. నం.203 జారీ చేసింది.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో నిధులు మంజూరైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నిధులతో గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.మంగంపల్లి నుంచే ఎమ్మెల్యే మేఘారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, అప్పటి నుంచి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఎంపీటీసీగా, పెద్దమందడి మండల ఎంపీపీగా, అనంతరం ఎమ్మెల్యేగా ఎదిగినప్పటికీ సొంత గ్రామంతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ రమేష్‌నాయక్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


Comments