ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.

ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.

* జమ్మికుంటలో పేషంట్ సేఫ్టీ డేపై అవగాహన.. 

* వడ్డెర కాలనీలో డ్రై డే కార్యక్రమం

జమ్మికుంట, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య చికిత్సలో చోటుచేసుకునే పొరపాట్లను నివారించడమే పేషంట్ సేఫ్టీ డే ముఖ్య ఉద్దేశమని హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చందన ఆధ్వర్యంలో పేషంట్ సేఫ్టీ డేపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ప్రభుదాస్ మాట్లాడుతూ.. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగులకు సురక్షితమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య చికిత్స, మందుల వినియోగం, వ్యాధి నిర్ధారణలో జరిగే పొరపాట్లను సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నారు. చికిత్సకు సంబంధించిన నిర్ణయాల్లో రోగులు, వారి కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయడం ద్వారా మెరుగైన వైద్య ఫలితాలు సాధించవచ్చని వివరించారు.
మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు
పేషంట్ సేఫ్టీ డే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. కార్మికులకు రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు.
వడ్డెర కాలనీలో డ్రై డే అవగాహన
వడ్డెర కాలనీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది డ్రై డే ఫ్రైడే, డ్రై డే ట్యూస్‌డేపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సదానందం, శరత్, జిల్లా ఆరోగ్య విద్యావేత్త పంజాల ప్రతాప్ గౌడ్, సబ్‌యూనిట్ అధికారి రాజేందర్ రాజు, ఆరోగ్యశాఖ సిబ్బంది సాజిదా పర్వీన్, నరేందర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG-20260918-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!