రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం...
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి .
ఖమ్మం బ్యూరో , సెప్టెంబరు- 16(తెలంగాణ ముచ్చట్లు )
ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.
బుధవారం ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారిని తో పాటు, సరిహద్దు రైతుల సమక్షంలో జరగాలని, రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏలాంటి అభ్యంతరాలకు గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిగొండ తహసీల్దారు రవి కుమార్, అధికారులు, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.


Comments