సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.

సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.

* పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది.. 

* సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

జమ్మికుంట, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో సాగిన సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ చారిత్రక పోరాటాన్ని వక్రీకరించి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
సీపీఎం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డీసీఎంఎస్ నుంచి బొమ్మలగుడి, గాంధీ చౌరస్తా మీదుగా ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి మోత్కులగూడెం చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. 1946 నుంచి 1951 వరకు ఐదేళ్లపాటు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో సాగిన ఈ పోరాటం నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించిందని వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య ప్రారంభమై, సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు. అనంతరం నిజాం పాలకుడికి రాజ్ ప్రముఖ్ పదవి కల్పించడం ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం భూస్వామ్య వర్గాల పక్షాన నిలిచిందని ఆయన విమర్శించారు.
రజాకార్ల దాడులు, భూస్వాములు, దొరల దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, విలీనం అనంతరం కూడా కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలపై సైనిక చర్య కొనసాగిందని వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమి పేదలకు దక్కిందని, వేలాది గ్రామాల్లో ప్రజా పాలనకు సంబంధించిన వ్యవస్థలు ఏర్పడ్డాయని తెలిపారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సాయుధ పోరాటంతో సంబంధం లేదని, అయినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయని వాసుదేవరెడ్డి ఆరోపించారు. అప్పటి పోరాటాన్ని కేవలం హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పేర్కొనడం కంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని చారిత్రక వాస్తవాల ఆధారంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సాయుధ రైతాంగ పోరాట చరిత్రను జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామానికి కరపత్రాల ద్వారా తీసుకెళ్లడంతో పాటు సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, కమిటీ సభ్యులు దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, భాషిర సంపత్‌రావు, రాచపల్లి ఐలయ్య, బైరం సమ్మయ్య, గేర రాజకుమారి, కన్నం సదానందం, రాచపల్లి తిరుపతి, సాగర్ల కుమార్,రంజిత్, పోచయ్య, రాజు, పుల్ల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260915-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు) మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
మానకొండూర్‌లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.