డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన.
పెద్దమందడి,సెప్టెంబర్12(తెలంగాణ ముచ్చట్లు):
అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దమందడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పు ధర్నాలో వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో వెల్టూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డప్పులు వాయిస్తూ బీఆర్‌ఎస్ తీరును నిరసించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. స్పీకర్ పదవికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని, రాజకీయ విమర్శల పేరుతో రాజ్యాంగబద్ధ పదవులను అవమానించడం సరికాదని పేర్కొన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన డప్పు ప్రదర్శన జరిగిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యగా వారు అభివర్ణించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు ధర్నాలో నినాదాలు చేశారు.దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడకుండా రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, పెద్దమందడి-ఖిల్లా గణపురం మండలాల మార్కెట్ యార్డు డైరెక్టర్ రవీందర్,వార్డు సభ్యులు నాగభూషణ్, మద్దూరు వెంకటయ్య, పాముల రాములు, దయ్యాల అంజన్న, దయ్యాల అశోక్, దయ్యాల నాగన్న, నాగన్న, తదితరులు పాల్గొన్నారు.


Comments