విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయాలి.

వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయాలి.

కరీంనగర్, సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు ):

 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) కరీంనగర్ అర్బన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాలని సూచించారు.

పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, పీఈటీలు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం అందిస్తున్న కోటా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ అంజిరెడ్డికి మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో డీఈఓ చైతన్య జైని, కార్పొరేటర్ గాజా రామా శివరాం, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్, అర్బన్ సెక్రటరీ శంకరయ్య, నేషనల్ వాలీబాల్ ప్లేయర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20260911-WA0026

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.