ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .

ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్ ను భారాస నాయకులు నాగులవంచలో శుక్రవారం ఘనంగా సత్కరించారు.  28 సంవత్సరాలు విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని భారాస  జిల్లా నాయకుడు, రైతు బంధు సమితి మాజీ జిల్లా కమిటీ సభ్యుడు మంకెన రమేష్ పేర్కొన్నారు.  గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులను అత్యుత్తమ స్థాయికి వెళ్లేలా చేయటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.‌ ఈ కార్యక్రమంలో తిరుమలాపురం, కోమట్లగూడెం సర్పంచులు చాపలమడుగు వీరబాబు, కొండూరి పరిశుద్ధ రావు, నాగులవంచ పిఎసిఎస్ డైరెక్టర్ వంకాయలపాటి లచ్చయ్య, భారాస మాజీ మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, భారాస నాయకులు గురజాల హనుమంతరావు,  గడ్డం శ్రీనివాసరావు, బండి రామారావు, నారపోగు నాగయ్య,  తుమ్మలపల్లి శ్రీనివాసరావు, అంబటి వెంకటి, కోపూరు నవీన్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.