హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
* ప్రముఖ వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు
* ఉచితంగా మందుల పంపిణీ
వీణవంక, సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో జమ్మికుంట ఆదిత్య, అమృత హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శిబిరానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్, న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్, గైనకాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై తగిన సూచనలు అందించారు. రోగులకు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను సైతం ఉచితంగా పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరం నిర్వహణకు సహకరించిన గ్రామ సర్పంచ్ జడల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మేక శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలకు ఆదిత్య, అమృత హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లోనూ వివిధ గ్రామాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేస్తామని ఆదిత్య, అమృత హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది.


Comments