గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి.
డీజేలకు అనుమతి లేదు.
– పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి
పెద్దమందడి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి సూచించారు. మండల పరిధిలో ఇప్పటివరకు 15 గణేష్ మండపాలకు అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై కోరారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ వైర్ల విషయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఎస్సై జలంధర్ రెడ్డి కోరారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.


Comments