ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.

IMG-20260911-WA0049* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర

జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రజారాజ్య పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న రాబోయే రోజుల్లో చేపట్టనున్న పాదయాత్రకు మద్దతుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం నుంచి ప్రారంభమైన పాదయాత్ర జమ్మికుంట మీదుగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు కొనసాగింది.
హుజూరాబాద్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రజల్లో ఉండాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
పాదయాత్ర సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై మరింత బలమైన పోరాటాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల గొంతుకగా నిలవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
ఈ పాదయాత్రలో ప్రజారాజ్య పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జింక లావణ్య, రాష్ట్ర మహిళా సహాయక కార్యదర్శి గుండోజు పద్మ, కార్యకర్త జడల ముత్తమ్మ, జిల్లా అధ్యక్షురాలు గంగిపెల్లి అరుణ, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, జిల్లా కార్యదర్శి దాట్ల శ్రీనివాస్, హుజూరాబాద్ మండల అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున, ప్రధాన కార్యదర్శి మాడుగుల రాజు పాల్గొన్నారు.
అలాగే ముఖ్య నాయకులు నేదురు రాజు, నేదురు కుమారస్వామి, చెరుకు పైడయ్య, మాదం ఐలయ్య, మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎడవల్లి హరీష్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాదయాత్రను ముందుండి నడిపిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా కార్యదర్శి దాట్ల శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో హుజూరాబాద్‌ నుంచి జమ్మికుంట, అక్కడి నుంచి ఇల్లందకుంట వరకు పాదయాత్ర ఉత్సాహభరితంగా సాగింది.
రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల పక్షాన నిరంతరం పోరాడేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.