పెద్దమందడిలో 15న సాధారణ సర్వసభ్య సమావేశం.
పెద్దమందడి ఎంపీడీఓ పరిణత.
పెద్దమందడి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం కోసం పెద్దమందడి మండలంలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులతో ఈ నెల 15న సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు పెద్దమందడి ఎంపీడీఓ పరిణత తెలిపారు.మంగళవారం ఉదయం 10.30 గంటలకు పెద్దమందడి రైతు వేదికలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఎంపీడీఓ వెల్లడించారు.మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ సూచించారు. అదేవిధంగా మండలంలోని పాత్రికేయులు కూడా సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


Comments