చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి.
జిల్లా అధ్యక్షులు పసుమర్తి సీతా చంద్రరావు.
ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
ఈ నెల 13 ఆదివారం ఉదయం గం. 8-00 లకు ఉప్పల్ భగాయత్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ భవన సముదాయాల చారిత్రాత్మక నిర్మాణానికి భూమి పూజ
కార్యక్రమం శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది.
తదనంతరం ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి మన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య బంధు మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి సీతాచంద్రరావు కోరారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, మండల కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాలు యువజన సంఘం, మహిళా సంఘం, సేవాదళ్, రాజకీయ విభాగం, విద్యా కమిటీల సభ్యులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, మాజీ జిల్లా కోశాధికారులు అందరూ తప్పకుండా హాజరు కావాల్సిందిగా పసుమర్తి కోరారు.


Comments