విద్యుత్ వినియోగదారులు పొదుపును అలవర్చుకోవాలి.

విద్యుత్ ఉపకేంద్రాల తనిఖీలో టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్.

విద్యుత్ వినియోగదారులు పొదుపును అలవర్చుకోవాలి.

చిల్పూర్,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు): 

వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పాటు, ఎండల తీవ్రత కారణంగా విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి. మధుసూదన్ తెలిపారు. వినియోగానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.

విద్యుత్ వినియోగంలో వినియోగదారులు పొదుపు పాటించాలని, అవసరం లేని సమయంలో విద్యుత్ ఉపకరణాలను ఆపివేసి వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.శుక్రవారం స్టేషన్ ఘనపూర్ డివిజన్ పరిధిలోని చిల్పూర్ మండలం రాజవరం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంతో పాటు చిన్నపెండ్యాల, మల్కాపూర్, లింగంపల్లి విద్యుత్ ఉపకేంద్రాలను డీఈ (ఆపరేషన్స్) ఘనపూర్ బి. సారయ్యతో కలిసి డైరెక్టర్ మధుసూదన్ తనిఖీ చేశారు. ఆయా ఉపకేంద్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించడంతో పాటు కార్యాలయాల్లోని రికార్డులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పద్ధతులను విస్తృతంగా వినియోగించడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను గణనీయంగా తగ్గించామని తెలిపారు. భవిష్యత్తులో నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఓవర్‌లోడ్, లో-వోల్టేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, విద్యుత్ అంతరాయాలకు తక్షణ పరిష్కారం చూపేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మానవ రహిత సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారుల పర్యవేక్షణలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సమస్యలు ఎదురైన వెంటనే స్పందించాలని ఆదేశించారు. ‘వన్ మినిట్ రూల్’ను పాటిస్తూ విద్యుత్ సేవలపై ప్రజలకు, వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా ఎల్‌సీలు తీసుకుని సిబ్బంది విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడీఈ రణధీర్ రెడ్డి, ఏఈలు ఆర్. సురేష్, శ్వేత, పి. శంకర్, శివకుమార్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ నీలం ఐలేష్, లైన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు, ఆర్టిజన్ ఎం. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.