సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలి: యాదగిరి సునీల్‌రావు.

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి.

కరీంనగర్, సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు ):

 సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలోని ఆపరేషన్ పోలోతో నిజాం పాలనకు ముగింపు పలికిందన్నారు.

సెప్టెంబర్ 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లో ‘స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్’, భారీ విమోచన చరిత్ర మ్యూజియం, ప్రతి జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అజ్ఞాత వీరులను గుర్తించి అమరవీరుల జాబితా విడుదల చేయాలని, చారిత్రక ప్రాంతాలను కలుపుతూ ‘విమోచన సర్క్యూట్’ ఏర్పాటు చేయాలని సూచించారు. బీజేపీ గత 40 ఏళ్లుగా సెప్టెంబర్ 17 అధికారిక నిర్వహణ కోసం పోరాడుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని యాదగిరి సునీల్‌రావు కోరారు.

కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.