వెల్టూర్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు హర్షణీయం.

వెల్టూర్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు హర్షణీయం.

విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు

-- కాంగ్రెస్ నాయకులు వడ్డే శేఖర్

పెద్దమందడి,సెప్టెంబర్‌11(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ నాయకులు వడ్డే శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. జీఓ నంబర్ 164 ద్వారా రూ.11.75 కోట్ల వ్యయంతో పాఠశాల మంజూరు కావడం గ్రామ భవిష్యత్తుకు ఎంతో మేలు చేసే నిర్ణయమని అన్నారు.వెల్టూర్ గ్రామ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన కృషి అభినందనీయమని వడ్డే శేఖర్ కొనియాడారు. గ్రామ అవసరాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ద్వారా వెల్టూర్‌తో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.వెల్టూర్‌కు పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడంలో కృషి చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.