ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.

గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: మేయర్ కొలగాని శ్రీనివాస్.

ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.

కరీంనగర్, సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు ):

 గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జన కార్యక్రమాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కోరారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, పోలీస్ కమిషనర్‌, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్‌లను వ్యక్తిగతంగా కలిసి నిమజ్జన ఏర్పాట్లపై చర్చించి వినతిపత్రాలు అందజేశారు. అలాగే జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు లేఖలు రాసి, నిమజ్జనానికి అనుకూలంగా ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలను ప్రతి ఏటా చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లోని ఎస్సారెస్పీ కాలువల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిమజ్జన తేదీలను దృష్టిలో ఉంచుకుని కాలువల్లో ముందుగానే సరిపడా నీటిని విడుదల చేసి, అవసరమైన నీటిమట్టాన్ని కొనసాగించాలని కోరారు.

కాలువల్లో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల నిమజ్జనానికి ఆటంకం కలగడంతో పాటు భక్తులకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు.

నిమజ్జన కేంద్రాల్లో విద్యుత్‌, వైద్య–ఆరోగ్య, అగ్నిమాపక, పోలీస్‌, ఇరిగేషన్‌, నగరపాలక సంస్థ శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ప్రధాన రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, గ్రావెల్ ఏర్పాటు, ఫ్లడ్‌లైట్లు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, క్రేన్లు, బారికేడింగ్‌, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సమాచార బోర్డులు వంటి సౌకర్యాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని కోరారు.

గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్ ప్రజల భక్తి, సంస్కృతి, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా జరిగేలా అధికారులు సమన్వIMG-20260911-WA0043యంతో పనిచేయాలని కోరారు. మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.