పారంపర్య వైద్యానికి ప్రభుత్వ గుర్తింపునివ్వాలి.

పూర్వ వైభవం తీసుక రావాలి. 

పారంపర్య వైద్యానికి ప్రభుత్వ గుర్తింపునివ్వాలి.

- పారం పర్య వైద్య మహా సంఘం అభ్యర్థన
- సదస్సు వివరాలు వెల్లడించిన సంఘం గౌరవ సలహాదారులు రామడుగు వీరభద్రాచారి

ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )

పారం పర్య వైద్యానికి ప్రభుత్వం గుర్తింపు నివ్వాలని పారంపర్య వైద్య మహా సంఘం డిమాండ్ చేసింది. ఈ నెల 8,9,10 తేదీల్లో భద్రాచలంలో అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి ల నిత్య అన్నదాన సత్రంలో  పారం పర్య వైద్య మహా సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ మేరకు సదస్సు వివరాలను సంఘం గౌరవ సలహాదారులు రామడుగు వీరభద్రాచారి శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు . ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్,కేరళ, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి పారం పర్య వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సులో భారతీయ సనాతన ఆయుర్వేద సిద్ధ వైద్యం, వైద్య విధానాలు , వైద్య గ్రంథాలు , దేశమంతటా వేల సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న మన దేశ వారసత్వ సంపదకు మనమంతా వారసులమేనన్నారు.  మన వైద్యాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. మన పారం పర్య వైద్యానికి ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు ను సాధించేందుకు ఈ పారం పర్య మహా సంఘం ముందుకు సాగుతున్నట్లు పలువురు వక్తలు ఉద్ఘాటించినట్లు తెలిపారు . ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సంఘం గౌరవ సలహాదారు రామడుగు వీరభద్రాచారి  స్వయంగా తయారు చేసిన జీవ గడియారం (బయో క్లాక్)ను శివకేత్ర పీఠాధిపతులు శివ స్వామీజీ చేతుల మీదుగా ఆయురారోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరీ భగవానుడి కాంస్య విగ్రహాన్ని బహుకరిస్తూ అభినందించి ఆశీర్వదించినట్లు తెలిపారు. తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంత యాత్రీ మహర్షి , ఏపీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి ఎల్ శ్రీనివాసులు, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ పుత్తూరు సెల్య వైద్యులు చంద్రశేఖర రాజు, వైద్య రత్న, అడవిదేవుడు జమాల్ ఖాన్, యోగి శ్రీ  సిద్ధ రామయ్య, మెడిటస్ ప్రొఫెసర్ టీడీయూ బెంగుళూరు హరిరామ మూర్తి, గౌరవ అధ్యక్షులు సర్జన రమేష్, గౌరవ సలహాదారులు దాడే వెంకట్రావ్ , ఉపాధ్యక్షులు కామంచి  శ్రీనివాస్, భాను ప్రసాద్, కోశాధికారి దుర్గా. రాణి, ఉప కోశాధికారి అరుణాజ్ సహాయ కార్యదర్శులు రాజయ్య, రామకృష్ణయ్య, వెంకటేశ్వర రెడ్డి, వహీద్ అలీ, పద్మారావు, మోహన్ , రవీందర్, ఆనందం, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొని అభినందించారు. 
ఈ జీవ గడియారం ప్రాముఖ్యత :  శరీరంలోని త్రి దోషాలైనా వాత, పిత్త, కఫం సమతుల్యతపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ ముడు దోషాలు ఏ మాత్రం అసమ తుల్యతకు గురైనా రోగాల బారిన పడతామన్నారు.  ఈ జీవ గడియారం ఏ సమయంలో ఏ పని చేయాలనేటువంటి దినచర్యను, ఆయా సమయాలలో వాత , పిత్త, కఫాల దోషాలను తెలుపుతుందన్నారు. ఈ జీవ గడియారం నిరంతరం దినచర్య తో పాటు మనకు క్రమశిక్షణ నేర్పుతుందనీ వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.