స్వర్ణ నంది పురస్కారంతో సదానిరంజన్ సిద్ధాంతికి ఘన సత్కారం.

స్వర్ణ నంది పురస్కారంతో సదానిరంజన్ సిద్ధాంతికి ఘన సత్కారం.

 ఎల్కతుర్తి , సెప్టెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు): 

సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న శివ శ్రీ సదానిరంజన్ సిద్ధాంతికి ప్రతిష్ఠాత్మక స్వర్ణ నంది పురస్కారం లభించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్‌లో కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గురువందనం, ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూర్వ మంత్రి శ్రీ సముద్రాల వేణుగోపాలచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులను ఘనంగా సన్మానించారు. కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ గత 26 సంవత్సరాలుగా కళలు, సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మికతతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి అందిస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
అర్చక పురోహితులు, వాస్తు–జ్యోతిష్య పండితులుగా ఆధ్యాత్మిక, ధార్మిక, వాస్తు, జ్యోతిష్య రంగాల్లో సదానిరంజన్ సిద్ధాంతి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఆయనకు స్వర్ణ నంది పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
ప్రజలకు ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల్లో మార్గదర్శకత్వం అందిస్తూ, వాస్తు–జ్యోతిష్య రంగాల్లో సేవలందిస్తున్న సదానిరంజన్ సిద్ధాంతికి ఈ పురస్కారం దక్కడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆయన సేవలకు లభించిన ఈ గౌరవం మరింత మంది సేవా కార్యక్రమాల వైపు ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ తనకు లభించిన స్వర్ణ నంది పురస్కారం మరింత బాధ్యతను పెంచిందన్నారు. సమాజానికి తన వంతు సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని తెలిపారు. తనను గుర్తించి స్వర్ణ నంది పురస్కారంతో ఘనంగా సత్కరించిన కళానిలయం సాంస్కృతిక సంఘ సంస్థ నిర్వాహకులు, ఏ. సురేందర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, కళానిలయం సభ్యులు, ఉపాధ్యాయులు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.