వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి .
చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ .
చిల్పూర్,సెప్టెంబర్12(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని ప్రతి గ్రామంలో రాబోయే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయనున్న మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.ప్రతి వినాయక మండపం ఏర్పాటుకు ముందుగా పోలీస్‌స్టేషన్ అనుమతిని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయాలని, ఇందుకోసం ఎవరూ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సరైన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
మండపం ఏర్పాటుకు విద్యుత్ శాఖ అనుమతి కూడా పొందాలని తెలిపారు. భద్రత కోసం మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు, డీజేలు వినియోగించరాదని, నిబంధనల ప్రకారం సౌండ్ లిమిట్ పాటించాలని సూచించారు.
రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా మండపాలు ఏర్పాటు చేయరాదని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.


Comments