18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.

పెద్దమందడి డిప్యూటీ తహసిల్దార్‌ గౌస్‌.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.

పెద్దమందడి,సెప్టెంబర్‌12(తెలంగాణ ముచ్చట్లు):

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి డిప్యూటీ తహసిల్దార్‌ గౌస్‌ సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పెద్దమందడిలో పత్రాలను పరిశీలించిన ఆయన, ఈ సందర్భంగా ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్‌ గౌస్‌ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఫారం–6 ద్వారా ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని తెలిపారు.అర్హత ఉన్న యువత ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పత్రాల పరిశీలనను అధికారులు చేపడుతున్నారని, ప్రజలు అధికారులకు అవసరమైన సహకారం అందించాలని డిప్యూటీ తహసిల్దార్‌ గౌస్‌ కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, బి ఎల్ వో లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.