రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
బీఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి.
పెద్దమందడి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని పెద్దమందడి మండలం మోజర్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, ప్రస్తుతం పంటలకు నీరు అత్యవసరంగా ఉందన్నారు. ఈ సమయంలో సాగునీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.మూడు పంపులను నిరంతరాయంగా నడిపించి అక్టోబర్ 31 వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అవసరమైన మేరకు నీటిని ఎత్తిపోసి రైతుల పంటలకు నిరంతరాయంగా నీరు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.రైతుల పంటలు ఎండిపోతే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి రైతుల పంటలకు సాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు.


Comments