టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.

మానకొండూర్‌లో ఉచిత ఆహార సరుకులు పంపిణీ చేసిన డా. కవ్వంపల్లి అనురాధ.

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.

మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):

మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు. మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారి సతీమణి, అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎం.డీ డా. కవ్వంపల్లి అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొని టీబీ బాధితులకు ఆహార కిట్లను అందజేశారు.

టీబీ వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడేందుకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వినియోగిస్తూ, వైద్యుల సూచనలు పాటించాలని ఆమె సూచించారు.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన టీబీబాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె కోరారు.IMG-20260912-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.