దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.

దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.

-- కాశపోగు జాన్‌, దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకులు

కొత్తకోట ఎస్సై విక్రమ్‌ చేతుల మీదుగా వాల్‌పోస్టర్‌ విడుదల

కొత్తకోట,సెప్టెంబర్12( తెలంగాణ ముచ్చట్లు):

వచ్చే నెల 7వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్‌ పిలుపునిచ్చారు. మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై విక్రమ్‌, సెకండ్‌ ఎస్సై భాస్కర్‌ నాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా కాశపోగు జాన్‌ మాట్లాడుతూ.. దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దళిత జర్నలిస్టుల పోరం నిరంతరం పోరాడుతోందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయాలని, దళిత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.అర్హులైన జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, దళిత జర్నలిస్టులకు అభయహస్తం పథకం కింద సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అక్రిడిటేషన్‌ కమిటీలో దళిత జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దళిత జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, భవిష్యత్‌ కార్యాచరణపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులంతా పెద్ద సంఖ్యలో హాజరై 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని కాశపోగు జాన్‌ కోరారు.అనంతరం ఎస్సై విక్రమ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ కార్యదర్శి ధనుష్‌, దళిత జర్నలిస్టుల పోరం లీగల్‌ అడ్వైజర్‌ మునగారి కృష్ణ, మాజీ కోఆప్షన్‌ సభ్యులు మిషేక్‌, కాంగ్రెస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు మేస్త్రి శ్రీను, సీనియర్‌ జర్నలిస్టు ఈశ్వర్‌, దిశ రమేష్‌, బాలరాజు, లక్ష్మణ్‌, దాసు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.