ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామివారి వార కల్యాణం.

ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామివారి వార కల్యాణం.

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు): 

రుణ బాధల నుంచి విముక్తి కలిగించి, భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం, కలియుగ దైవం చిల్పూర్‌గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామివారి వార కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామివారికి వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు.

స్థల పురాణం ప్రకారం.. పద్మావతి అమ్మవారితో వివాహం కోసం కుబేరుని వద్ద అప్పు చేసిన స్వామివారు, ఆ రుణ భారంతో తపస్సు చేసిన పుణ్యక్షేత్రమే చిల్పూర్‌గుట్ట అని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అఖండ దీపంలో నూనె పోస్తే అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.కల్యాణ మహోత్సవానికి జనగామ జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్–వరంగల్ హైవే మార్గం నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రతి శుక్రవారం అభిషేకం, శనివారం ప్రత్యేక పూజలతో పాటు వార కల్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ శ్రీమన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు గోలీ రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆలయ ఈవో బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులుతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్సిత వెంకట ఆశ్రిత (విజయవాడ), పాలిన అప్పలస్వామి–సత్యావతి, సానికొమ్ము వెంకట్ రెడ్డి–వెంకట రత్తమ్మ, గానగాని ఆనంద్–నిర్మల (ఆలేరు) వాస్తవ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.