కామ్రేడ్ సీతారాం ఆశయాలను కొనసాగించాలి.
సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి వర్ధంతి.
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు):
కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా స్టేషన్ ఘనపూర్‌లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఇర్రి అహల్య, మండల కార్యదర్శి మునిగల రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్‌లో ప్రజల గొంతుకగా నిలిచి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థంగా ప్రశ్నించారని గుర్తు చేశారు. ఆయన ప్రసంగాలు, విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యల పట్ల నిబద్ధతకు ప్రతీకగా నిలిచాయని అన్నారు.
ప్రజల ఐక్యతను కాపాడుతూ కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయడమే కామ్రేడ్ ఏచూరికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి, తోడెంగల ఐలయ్య, చిలుముల్ల భాస్కర్, పరమేష్, కిష్టయ్య, రామగోని సతీష్, సట్ల రాజు, దైద కుమార్, లింగన్న బోయిన కుమార్, సుధాకర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments