అభివృద్ధి పనుల్లో నాణ్యతే కీలకం.

అభివృద్ధి పనుల్లో నాణ్యతే కీలకం.

*కాశ్మీర్‌గడ్డలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం*

*పనులు త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచన*

*మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం: యాదగిరి సునీల్ రావు*

కరీంనగర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):

నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు మెరుగైన మౌIMG-20260912-WA0002లిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.

కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్‌లోని కాశ్మీర్‌గడ్డ మునావర్ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు యాదగిరి సునీల్ రావు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పనుల సమయంలో స్థానిక ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. గతంలో 42వ డివిజన్ సమస్యలు తక్కువగా ఉన్న డివిజన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిందని, అదే తరహాలో ప్రస్తుతం డివిజన్‌లో కొత్తగా చేరిన అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.

వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే జిల్లా పరిషత్ క్వార్టర్స్ వద్ద ఉన్న పార్కును త్వరలోనే అధునాతన రీతిలో అభివృద్ధి చేసి ప్రజలకు పునరంకితం చేస్తామని వెల్లడించారు.

డివిజన్ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీ, పార్కులు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని యాదగిరి సునీల్ రావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. చంద్రమౌళి, శ్రీధర్, అశోక్, వినోద్ కుమార్, విజయ భాస్కర్, ఖాదర్ ఫారుకి, ఇబ్రహీం, తబ్రేజ్, షారుక్, మహమ్మద్ ఆబిద్, డివిజన్ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.