వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతన సీసీ, పీఆర్వో నియామకం.
వేణుగోపాల్ రావు, మోహన కృష్ణలకు బదిలీ ఉత్తర్వులు.
వరంగల్,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్యాంపు క్లర్క్ (సీసీ) వేణుగోపాల్ రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహన కృష్ణలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక సమాచారం.
వేణుగోపాల్ రావును వరంగల్ రేంజ్ డీఐజీ కార్యాలయానికి, మోహన కృష్ణను స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. వారి స్థానాల్లో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏవోగా పనిచేస్తున్న ఇషాక్‌ను సీసీగా, సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిని పీఆర్వోగా నియమించినట్లు అధికారులు తెలిపారు.వేణుగోపాల్ రావు, మోహన కృష్ణ ఒకే పోస్టింగ్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారంటూ గతంలో కొన్ని ఆరోపణలు, వార్తా కథనాలు వెలువడినట్లు సమాచారం. ఈ అంశంపై పోలీస్ శాఖ అంతర్గతంగా విచారణ జరిపిందా, బదిలీలు ఆ విచారణ ఫలితంగా జరిగాయా అనే విషయంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తర్వుల ప్రకారం, అధికారుల పరిపాలనా అవసరాల మేరకు బదిలీలు, నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.


Comments