శ్రీ రామాంజనేయ ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
అధ్యక్షుడిగా సిల్ల వినోద్ ఏకగ్రీవ ఎన్నిక.
కరీంనగర్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో శ్రీ రామాంజనేయ ఆటో యూనియన్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్ నూతన అధ్యక్షుడిగా సిల్ల వినోద్‌ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కన్నం భూమేష్, ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్ల శ్రీనివాస్, కోశాధికారిగా పంగ రమేష్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సిల్ల వినోద్ మాట్లాడుతూ.. 2018లో ఏర్పాటైన శ్రీ రామాంజనేయ ఆటో యూనియన్ సభ్యులందరి సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఆటో కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, యూనియన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని వారికి అన్ని విధాలా అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
నూతన కార్యవర్గ ఎన్నిక పట్ల యూనియన్ సభ్యులు, స్థానిక ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.


Comments