అధికారంలో ఉండి కాంగ్రెస్ ధర్నాలు చేయడం విడ్డూరం.
రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు
-- బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి
పెద్దమందడి,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీ నాయకులే ధర్నాలు, నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి విమర్శించారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆందోళనల పేరుతో రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు.ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు పరిమితం కావడం సరికాదన్నారు. ముఖ్యంగా రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తూ, నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.సాగునీటి సరఫరాపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి, అవసరమైన మేరకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా నిరసనల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించడం మానుకోవాలని సూచించారు.చావు డప్పులతో చావును కోరుకోవడం ఏంటి? అని ప్రశ్నించిన అల్వాల వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. రైతులకు సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


Comments