కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
ఇంటి గోడపై మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గీయించుకున్న కొమ్ము బ్రహ్మయ్య.
పెద్దమందడి,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం 7వ వార్డు సభ్యుడు కొమ్ము బ్రహ్మయ్య వినూత్నంగా చాటుకున్నారు. తన అభిమాన నాయకుడు కేసీఆర్ చిత్రపటాన్ని తన ఇంటి గోడపై అందంగా చిత్రీకరించుకుని అభిమానాన్ని చాటుకున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్ర తనను ఎంతగానో ప్రభావితం చేసిందని బ్రహ్మయ్య తెలిపారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఇంటి గోడపై ఆయన చిత్రాన్ని ప్రత్యేకంగా గీయించుకున్నట్లు చెప్పారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం, రాష్ట్ర సాధనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ విధంగా వ్యక్తపరిచినట్లు పేర్కొన్నారు.ఇంటి గోడపై చిత్రీకరించిన కేసీఆర్ చిత్రపటం స్థానికంగా పలువురిని ఆకట్టుకుంటోంది. నాయకుడిపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో వ్యక్తపరిచిన బ్రహ్మయ్యను పలువురు అభినందించారు.ఈ గోడ చిత్రాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ వనపర్తి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు టీ. సేనాపతి, ఉపాధ్యక్షుడు జంగం రమేష్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. వార్డు సభ్యులు సింగిరెడ్డి అమల, కొమ్ము విష్ణు, ఆంజనేయులు, మౌగిలయ్య, వెంకటయ్య, బాల నాగన్న, సింగిరెడ్డి నాగరాజు, కూడుకుంట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.


Comments