ఏఐపీసీ చైర్మన్‌ను కలిసిన జిల్లెల ఆదిత్య రెడ్డి.
సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ.
Views: 0
On
హైదరాబాద్,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మధు యాష్కీ గౌడ్‌ను ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సంస్థను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ, వృత్తి నిపుణులను విస్తృతంగా భాగస్వాములను చేయడం తదితర అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వృత్తి నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచుతూ సంస్థను మరింత క్రియాశీలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.వృత్తి నిపుణుల సూచనలు, అనుభవాలను ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని చర్చించారు. సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేస్తూ ఏఐపీసీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Sep 2026 21:37:29
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...


Comments