నివాస్ కుటుంబానికి ఎస్‌ఎస్ గ్రూప్ చేయూత.

25 కేజీల బియ్యం అందజేసిన సభ్యులు.

నివాస్ కుటుంబానికి ఎస్‌ఎస్ గ్రూప్ చేయూత.

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన కలకోటి నివాస్ కుటుంబానికి ఎస్‌ఎస్ (సింగపురం సహకారం) గ్రూప్ సభ్యులు అండగా నిలిచారు.ఆదివారం నివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్‌ఎస్ గ్రూప్ సభ్యులు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. అనంతరం మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కష్టకాలంలో నివాస్ కుటుంబానికి తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు ఎస్‌ఎస్ గ్రూప్ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్ గ్రూప్ సభ్యులు సింగపురం రాజేందర్, సింగపురం (బలగం) ప్రవీణ్, సింగపురం కిట్టు, ప్రతీష్, బాబు, చింటూ, చందు, కేఫా, టింకులు, నిశాంత్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు! రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...
తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!
దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.